పేటను సంగారెడ్డి జిల్లాలో కలపండి
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని కోరుతూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు కలెక్టర్ రాహుల్‌రాజ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. సోమవారం మండలంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వారు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 86 వినతులు వచ్చి నట్లు తెలిపారు. అనంతరం వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యు వత ఆయన చూపిన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ షాకీర్‌అలీ, ఎంఈఓ వెంకటేశం, ఏఓ కృష్ణ, ఏఈ రమేశ్ తదితరులు పాల్లొన్నారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
మెదక్ కలెక్టరేట్: త్వరలో నిర్వహించబోయే మున్సిపల్ ఎన్నికలకు మున్సిపల్ అధికారులంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా, మున్సిపల్ అధికారులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని 4 మున్సిపాలిటీల కమిషనర్లతో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.


