సేంద్రియ సాగుతో ప్రయోజనం
తూప్రాన్: సేంద్రియ కూరగాయల పంటల సా గుతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి ప్రతాప్‌సింగ్, కేవీకే తునికి శాస్త్రవేత్తలు రవి, శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని నర్సంపల్లిలో రైతులకు ఉద్యాన పంటల సాగు, రాయితీలపై రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తూప్రాన్ మండలంలో 500 ఎకరాల్లో కూరగాయ పంటలు సాగులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో పురుగుమందుల వాడకం వల్ల కలుషితమైన కూరగాయల ఉ త్పత్తి జరుగుతుందన్నారు. రైతులందరూ ఉద్యాన శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను పాటించి నాణ్యమైన కూరగాయలను పండించాలని సూ చించారు. అనంతరం ఆయిల్‌పామ్ సాగు ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గంగుమల్లు, ఉద్యాన అధికారి రచన, లీవ్ పామ్ మేనేజింగ్ డైరెక్టర్ రంగనాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్‌సింగ్


