మెరుగైన వైద్య సేవలు అందించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచ్‌ఎస్ శివదయాల్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం కౌడిప ల్లి సీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా జనరల్ ఓపీ, ల్యాబ్, మందుల రూం, ఇన్ పేషెంట్ వార్డులను పరిశీలించి సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న సీహెచ్‌సీని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు సీహెచ్‌సీలో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీలో చిన్న చిన్న పనులు ఉన్నాయని తెలిపారు. సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
డీసీహెచ్‌ఎస్ శివదయాల్


