క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగు
అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్ కలెక్టరేట్: క్రీడలతో స్నేహ సంబంధాలు పెరుగుతాయని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు, అవుట్ డోర్ స్టేడియంలో ఫుట్‌బాల్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఓటమి లేకుంటే గెలుపు అనేదే లేదన్నారు. ఓడిన జట్టు మరింత శిక్షణ పొంది గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. అనంతరం డీఈఓ విజయ మాట్లాడుతూ.. క్రీడల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలోని 29 పాఠశాలల నుంచి 700 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి పట్టణ సీఐ మహేశ్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి నాగరాజు, పీడీలు మాధవరెడ్డి, వినోద్, శ్యా మయ్య, విజయ్, శేఖర్, దేవేందర్‌రెడ్డి, రవి, కిరణ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.


