ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
నర్సాపూర్ రూరల్: వరిలో అంతర పంటగా ఆయిల్‌పామ్ సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్‌సింగ్ రైతులకు సూచించారు. గురువారం మండలంలోని కాగజ్‌మద్దూర్‌కు చెందిన రైతు వెంకటరమణ వరిపొలంలో ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో లీవ్‌ఫామ్ అధికారి డాక్టర్ రంగనాయకులు, ఏడీ సంధ్యారాణి, మండల వ్యవసాయ శాఖ అధికారి దీపిక, ఏఈఓలు మోహన్, తేజస్విని, రుతు, కాగజ్ మద్దూర్ ఉపసర్పంచ్ భాస్కర్, లీవ్ ఫామ్ రిసోర్స్ కంపెనీ మేనేజర్ కృష్ణారావు, టెక్నికల్ పర్సన్ అజయ్, శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్


