క్రీడలకు అత్యంత ప్రాధాన్యం
మెదక్ కలెక్టరేట్: క్రీడాకారులు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డీఈఓ విజయ సూచించారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా స్థాయి పీఎంశ్రీ వాలీబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 29 పాఠశాలల నుంచి 580 మంది బాలబాలికలు ఈ పోటీలలో పాల్గొన్నారు. డీఈవో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. క్రీడా పరికరాల కొనుగోలుకై ఇప్పటికే పీఎంశ్రీ పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని రాష్ట్రస్థాయిలో రాణించాలన్నారు. ముగింపు కార్యక్రమానికి డీఎస్పీ ప్రసన్నకుమార్ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో బాలుర విభాగంలో చిన్నశంకరంపేట, గోమారం, శివ్వంపేట మండలాల జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు నిలిచారు. అలాగే బాలికల విభాగంలో గోమారం, అక్కన్నపేట, శివ్వంపేట జెడ్పీహెచ్‌ఎస్‌ల విద్యార్థులు నిలిచారు. వీరికి మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ బహుమతులు అందజేశారు.
జిల్లా విద్యాధికారి విజయ
పీఎంశ్రీ వాలీబాల్ పోటీలు ప్రారంభం


