వానర సైన్యం బందీ!
ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆలోచించకుండా ఆ గ్రామ యువకులు నడుంబిగించారు. నిత్యం తీవ్ర సమస్యగా మారిన కోతుల బెడదను తొలగించేందుకు ముందుకు వచ్చారు. తలా ఇంత పోగేశారు.. కోతులను తరిమేసేందుకు కార్యచరణ చేపట్టారు. ఫలితంగా చిన్నశంకరంపేట మండలం జంగరాయిలో నెలకొన్న కోతుల బెడదకు పరిష్కారం చూపారు. గ్రామానికి చెందిన 27 మంది యువకులు ఏకమై మొత్తం రూ.2.25లక్షలు జమ చేశారు. కోతులను పట్టేవారితో మాట్లాడి మూడు రోజులుగా సుమారు 500 కోతుల వరకు పట్టారు. వానర సైన్యం ఉపశమనం పొందారు. – చిన్నశంకరంపేట(మెదక్):


