గజ్వేల్‌లో వార్డుల విభజన అశాసీ్త్రయం
తూప్రాన్: గజ్వేల్ మున్సిపల్ వార్డుల విభజన శాసీ్త్రయంగా జరగలేదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. తూప్రాన్‌లో మంగళవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్ మున్సిపల్‌లో 20 వార్డులు ఉండగా.. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల ఓటర్లు సుమారు 14 వేల మందిని అశాసీ్త్రయంగా ఓటరు జాబితాలో చేర్చారని విమర్శించారు. 20 వార్డులున్న గజ్వేల్ మున్సిపాలిటీలో మరో 10 వార్డులు పెంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. తూప్రాన్‌లో బీజేపీకి మంచి పట్టు ఉందన్నారు. తూప్రాన్, గజ్వేల్ మున్సిపాలిటీల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. తూప్రాన్‌లో పదేళ్లు బీఆర్‌ఎస్, రెండేళ్లు కాంగ్రెస్ పాలనను ప్రజలు చూశారని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, జానకిరాంగౌడ్, మధుసూదన్‌రెడ్డి, దుర్గరాజ్‌యాదవ్, మహేశ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సరి చేయండి.. లేకుంటే కోర్టుకెళుతాం
ఎంపీ రఘునందన్‌రావు


