ఏడుపాయల టెండర్ల ఆదాయం రూ.30.60 లక్షలు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో మంగళవారం జరిగిన టెండర్ల ద్వారా రూ.30.60 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. దేవస్థానం వద్ద పూజా సామగ్రి విక్రయించుకునే హక్కుకు రూ.25.10 లక్షలు, ఎంటర్‌టైన్‌మెంట్, ఎగ్జిబిషన్‌కు రూ.5.50లక్షలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కాగా జాతరలో విద్యుత్ దీపాల అలంకరణ కోసం రూ.3.84 లక్షలు, టెంట్లు వంట సామగ్రి సరఫరా రూ.3.80 లక్షలు, తడకల పందిళ్లు ఏర్పాటు చేసేందుకు రూ.2.44 లక్షలు, అద్దె గదులకు పేయింట్ వేసేందుకు రూ.2.30 లక్షలకు టెండర్లు పాడారని తెలిపారు.
ఏబీవీపీ రాష్ట్ర
ఉపాధ్యక్షుడిగా సాయిలు
పాపన్నపేట(మెదక్): మండల కేంద్రమైన పాపన్నపేటకు చెందిన సుంకరి సాయిలు ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శంషాబాద్‌లో మూడు రోజులుగా ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన కార్యక్రమంలో టేక్మాల్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న సాయిలును రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన విద్యార్థి దశలో ఉస్మానియా యూనివర్శిటీలో ఏబీవీపీ కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర బాధ్యులుగా అవకాశం కల్పించినందుకు సాయిలు రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.


