కొనేవారు లేక.. రైతన్న గోస
నిరుపయోగంగా పెద్దశ ంకరంపేట సబ్ మార్కెట్ యార్డు
పెద్దశంకరంపేట(మెదక్): రైతులు పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర మార్కెట్ యార్డుల్లో దొరుకుతుందంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ఆచరణలో మాత్రం లోపాలున్నట్లు స్పష్టమవుతోంది. 2016లో పెద్దశంకరంపేటలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన సబ్ మార్కెట్ యార్డు లో ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించలేదు. నాబార్డు నిధులు వెచ్చించి దాదాపు రూ. 4 కోట్లతో 161వ జాతీయ ప్రధాన రహదారిని ఆనుకొని నిర్మించారు. 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం ఏర్పాటు చేశారు. కేవలం దీనిని గోదాం లాగానే వినియోగిస్తున్నారు తప్ప, కొనుగోళ్లు చేపట్టడం మరిచారు. దీంతో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన తూకం వృథాగా మారింది.
మార్కెట్ యార్డుగా మారిస్తే మేలు
పెద్దశంకరంపేట సబ్ మార్కెట్ యార్డును పూర్తి స్థాయి మార్కెట్ యార్డుగా మారుస్తానని గతంలో మాజీ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాంత రైతులు అప్పట్లో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కె ట్ యార్డుకు పెద్దశంకరంపేట సబ్ మార్కెట్ యా ర్డు అనుబంధంగా ఉంది. అప్పట్లో కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో ఎవరూ దీనిని పట్టించుకోలేదు. ప్రస్తుతం మార్కెట్ యార్డుగా మార్చి నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తే అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పేట మండలాలకు చెందిన రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సబ్‌మార్కెట్ యార్డ్ అలంకారప్రాయంగా మారింది. కేవ లం సివిల్ సప్‌లై గోదాంగా మార్చి బియ్యం, వడ్లు మాత్రమే నిల్వ చేస్తున్నారు.
కరువైన వసతులు
పెద్దశంకరంపేట సబ్ మార్కెట్ యార్డులో సరైన వసతులు కరువయ్యాయి. 161వ జాతీయ రహ దారి విస్తరణలో ప్రహరీ కూల్చివేశారు. నష్ట పరిహారం కింద నిధులు మంజూరైనా ఇప్పటికీ ప్రహరీ నిర్మాణం పూర్తి చేయలేదు. దీంతో పాటు సీసీ రోడ్డు నిర్మాణం, రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి ప్లా ట్‌ఫాంలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి వసతులు ఏర్పాటు చేసి వినియోగంలోనికి తేవాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోళ్లు చేపట్టాలి
ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, శనగపంటలు సాగవుతాయి. సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపడితే రైతులకు సరిౖన మద్దతు ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
– మారుతి, రైతు, పెద్దశంకరంపేట
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
పెద్దశంకరంపేట సబ్ మార్కెట్ యార్డును మా ర్కెట్ యార్డుగా మార్చే విషయమై ఉన్నతాఽ దికారులకు నివేదిస్తాం. ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు తగిన చర్యలు చేపట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– సునీల్, జోగిపేట మార్కెట్ యార్డు సెక్రటరీ
కొనేవారు లేక.. రైతన్న గోస
కొనేవారు లేక.. రైతన్న గోస


