మొన్నటి వరకు సన్నవడ్లకు రూ.3,400 అన్నరు. ఇప్పుడు రూ.2,600 అంటుండ్రు. పంట చేతికి వచ్చే సమయంలో ధరలు తగ్గిస్తున్నారు. ఇటు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమైతే వ్యాపారులు కూడా పోటీపడి వడ్లుకొంటరు. ఓ దిక్కు మబ్బులు పడుతున్నాయి.
– చొప్పరి నర్సింహులు, కుందారం, జైపూర్
నిబంధనల ప్రకారమే..
ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎక్కడా ఆరబోసుకోలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఇప్పటికే ఏజెన్సీల నిర్వాహకులకు సూచించాం. తేమ శాతం 17 లోబడి కొనుగోలు చేయడం జరుగుతుంది. పచ్చివడ్లు 30 శాతం పైన తేమ వచ్చిన వాటినే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. – వేణుగోపాల్,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి


