ప్లాస్టిక్‌ వ్యర్థాల శుద్ధి భేష్‌ | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వ్యర్థాల శుద్ధి భేష్‌

Nov 6 2026 1:38 AM | Updated on Nov 6 2026 1:38 AM

● సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ ద్వారా ముడి ఉత్పత్తులూ తయారీ ● పర్యావరణ పరిరక్షణలో కంపెనీ

శ్రీరాంపూర్‌: పర్యావరణ పరిరక్షణకు కంపెనీ చేపడుతున్న పలు కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. కాలనీల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను శుద్ధి చేసే తీరు మరింత భేషుగ్గా ఉంది. శ్రీరాంపూర్‌ ఏరియా పరిధిలోని సీసీసీ సీఐఎస్‌ఎఫ్‌ క్వార్టర్స్‌ సమీపంలో 20 నెలల క్రితం సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. పర్యావరణానికి ముప్పు వాటిల్ల కుండా కాలనీల్లో సివిల్‌ డిపార్ట్‌మెంట్‌వారు సేకరించే చెత్తలోని ప్లాస్టిక్ట్‌ వ్యర్థాలను ప్లాంట్‌ ద్వారా శుద్ధీకరణ చేస్తున్నారు. ఈ వ్యర్థాలను నుంచి ఇతర అవసరాలకు ఉపయోగపడేలా ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. కాలనీల నుంచి వచ్చే చెత్తాచెదారంలో ప్లాస్టి క్‌ వ్యర్థాలు, దుస్తులు, కిచెన్‌ వ్యర్థాలను వేరు చేసి ఈ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. రోజుకు సుమారు 25టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను శుద్ధి చేస్తున్నారు. ప్లా స్టిక్‌ను కరిగించగా వచ్చే ఎండ్‌ ప్రొడక్ట్స్‌ (పెల్లెట్స్‌) ను తిరిగి ఉపయోగించుకునే అవకాశముంది.

కంపెనీ అవసరాలకు కంపోస్టు

ఆహార వ్యర్థాలకు ఇక్కడ ప్లాంట్‌లో ప్రత్యేక పిట్‌ ఏర్పాటు చేసి ఎరువులు తయారు చేస్తున్నారు. ప్రత్యేక యంత్రంతో దీనిని సేంద్రియ ఎరువుగా మార్చిన తర్వాత కంపెనీ నర్సరీల్లోనే ఉపయోగించుకుంటున్నట్లు సివిల్‌ హెచ్‌వోడీ రవికుమార్‌ తెలిపారు. ఇలా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్లాంట్‌ పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుంది.

ఉచితంగా ఇవ్వడానికి సిద్ధం

ప్రస్తుతం ఇక్కడ వస్తున్న పెల్లెట్స్‌ను స్టాక్‌ చేసుకోవడం ఇబ్బందిగా మారింది. దీన్ని డిస్ట్రిబ్యూషన్‌ చేయడానికి అధికారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్లాస్టిక్‌ టైల్స్‌ లాంటి పరిశ్రమలు, ఇతర ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారు చేసే ఉత్పత్తులకు ఈ పెల్లెట్స్‌ ముడిసరుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే వీటిని ప్లాంట్‌ వద్ద ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.

– శ్రీనివాస్‌, ఏరియా జీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement