జన్నారం: వరిపంట చేతికి అందివచ్చే సమయంలో కడెం ప్రాజెక్టు నీటిని నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. గురువారం మండలంలోని రాంపూర్, తిమ్మాపూర్ గ్రామాల రైతులు తిమ్మాపూర్ ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. ఎస్సై ఉదయ్‌కిరణ్ వారిని సముదా యించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు జాడి గంగా ధర్ మాట్లాడుతూ తక్షణమే నీటిని విడుదల చేయకుంటే కడెం ఇరిగేషన్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడించడంతో రాస్తారోకో విరమించారు.


