మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనను వెలికి తీసేందుకు సోమవారం జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహించిన 32వ జిల్లా స్థాయి నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ ఆకట్టుకుంది. జిల్లాలోని 87 పాఠశాలల విద్యార్థుల వినూత్న సైన్స్ నమూనాలు, ప్రదర్శనలు జిల్లా విద్యాధికారి చంద్రయ్య తిలకించారు. నీటి సంరక్షణ, జల వనరుల ప్రాముఖ్యత, వాతావరణ కాలుష్య నివారణ చర్యలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఇళ్లలోని వ్యర్థాలను వర్గీకరించి పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించాలని సూచించారు. నవంబర్ చివరి వారంలో జిల్లా స్థాయి ఇన్‌స్పైర్, సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తామని సైన్స్ అధికారి రాజగోపాల్ తెలిపారు. ఎన్‌సీఎస్‌సీలో మొదటి నాలుగు స్థానాల్లో వేముల విశిష్ట(జెడ్పీహెచ్‌ఎస్, జైపూర్), బుర్ర రిన్వీశ్రీ(ఆక్స్‌పోర్డ్‌స్కూల్), ముత్లా ఆశ్విత(టీజీఎంఎస్, కాసిపేట), తుమ్మ దీక్షిత(కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ మంచిర్యాల) ఉత్తమ ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. విద్యార్థులకు తహసీల్దార్ రఫతుల్లాహుస్సెన్ బహుమతులు అందజేశారు. న్యాయనిర్ణేతలుగా అసిస్టెంటు ప్రొఫెసర్లు గంగయ్య, కుమారస్వామి, బోటనీ అధ్యాపకుడు నాగవర్మ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి వ్యవహరించారు. క్వాలిటీ కో–ఆర్డినేటర్ సత్తయ్య, డిస్ట్రిక్ అకడమిక్ కో–ఆర్డినేటర్ శ్రీమూర్తి, శ్రీనివాస్, సురేందర్ పాల్గొన్నారు.


