పాతమంచిర్యాల: జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ఎఫెక్ట్‌తో జిల్లాలోని 11 మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ మిగతా ఏడింటిని కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితుల దృష్ట్యా వ్యాపారులు నిత్యావసరాల ధరలు వివరీతంగా పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతోందన్నారు. ధరల అదుపునకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, జోగుల మల్లయ్య, రేగుంట చంద్రశేశేఖర్, ఖలిందర్ అలీఖాన్, చిప్ప నర్సయ్య, రేగుంట చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.


