– జోగు రామన్న, మాజీ మంత్రి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది రాక్షస పాలన. ఈ ఏడా ది జిల్లాలో 178 మంది రైతులు ఆత్మహత్య చేసుకో గా, అందులో రైతు బీమా ప్రీమియం ముగిశాకే 108 మంది తనువు చాలించారు. లక్ష మంది రైతుల రు ణాలు ఎగ్గొట్టిన దుర్మార్గుడు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు 90 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు, డ్రిప్, స్ప్రింక్లర్లు అందజేస్తే, రైఫిల్‌రెడ్డి అయిన రేవంత్ రెడ్డి క్రాప్ హాలీడే ప్రకటించడం సిగ్గుచేటు. రైతులను ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇండస్ట్రీయల్ కారిడార్, ఎయిర్‌పోర్టు అంటూ కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నాడు. సర్కార్‌కు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తానని బెదిరించి రేవంత్ రెడ్డి కమీషన్లకు అమ్ముడుపోయాడు. జిల్లాలో అన్ని మండలాలను కరువుగా ప్రకటించేంత వరకు కేటీఆర్ నాయకత్వంలో పోరాడుతూనే ఉంటాం.


