‘రజకులను కార్మికులుగా గుర్తించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘రజకులను కార్మికులుగా గుర్తించాలి’

Nov 2 2026 12:41 AM | Updated on Nov 2 2026 12:41 AM

పాతమంచిర్యాల: రజకులను కార్మికులుగా గుర్తించాలని రజక రిజర్వేషన్‌ సమితి జిల్లా అధ్యక్షుడు సంగెం లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంపెనీలలో రోజుకు 8 గంటలు పనిచేసే వారిని కార్మికులుగా గుర్తించినప్పుడు 12 గంటలు పనిచేసే రజకులను కార్మికులుగా ఎందుకు గుర్తించరన్నారు. సమావేశంలో రజక రిజర్వేషన్‌ సమితి రాష్ట్ర యూత్‌ గౌరవ అధ్యక్షుడు సంగెపు ఎల్లన్న, ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి తిరుపతి, జిల్లా గౌరవ అధ్యక్షుడు కంచెర్ల కొమురయ్య, ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి నస్పూరీ అంకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement