టీపీవోను సస్పెండ్‌ చేయాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

టీపీవోను సస్పెండ్‌ చేయాలని ధర్నా

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

● అంబులెన్స్‌ను ఎదురుగా ఢీకొట్టిన లారీ ● అనారోగ్యంతో బాధ పడుతున్న కూతురు, వెంట వెళ్తున్న తల్లి దుర్మరణం ● కడ్తాల్‌ జాతీయ రహదారి వద్ద ఘటన ● గాదిగూడ మండలం ఝరిలో విషాదం

ఇద్దరిని బలిగొన్న లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం

నార్నూర్‌/లక్ష్మణచాంద: అనా రోగ్యంతో బాధ పడుతున్న కూతురుతోపాటు ఆమెకు మె రుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌కు వెళ్తున్న తల్లిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబలించింది. ఈ ఘటన బాధిత కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చగా ఆదిలాబాద్‌ జిల్లా గాది గూడ మండలం ఝరి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. సోన్‌ ఎస్సై గోపి, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝరి గ్రామానికి చెందిన మెస్రం సోము పటేల్‌ చెల్లి సరస్వతి (17) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. సరస్వతికి వారం రోజులు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు. తల్లి పారుబాయి (70) దగ్గరుండి సరస్వతి బాగోగులు చూ సుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించాలని కుటుంబీకులు నిర్ణయించారు. ఈ క్ర మంలో గురువారం రాత్రి అంబులెన్స్‌లో సోముపటేల్‌, పారుబాయి సరస్వతిని హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కడ్తాల్‌ వై జంక్షన్‌ వద్ద అర్ధరాత్రి లారీని అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్‌ రాంగ్‌ రూట్‌లో వీరు ప్రయాణిస్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పారుబాయి, సరస్వతి అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ సాయికిరణ్‌తోపాటు సరస్వతి కుటుంబ స భ్యులైన సోము, గీత, తూమురం సాయిలుకు బలమైన గాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం నిర్మల్‌ ప్ర భుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మద్యం మత్తులో లారీ డ్రైవర్‌ రాంగ్‌ రూట్‌లో వచ్చి అంబు లెన్స్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. మృతురాలి అన్న సోము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తునట్లు సోన్‌ ఎస్సై గోపి తెలిపారు.

కాసిపేట(బెల్లంపల్లి): మాజీ కౌన్సిలర్‌ తాండ్ర రామకృష్ణపై చేయి చేసుకుని దురుసుగా ప్రవర్తించిన టీపీవో సునిల్‌ను సస్పెండ్‌ చేయాలని శుక్రవారం బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, నాయకులు బెల్లంపల్లి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల విషయమై టీపీవోను 20వార్డు మాజీ కౌన్సిలర్‌ వివరాలు అడిగితే దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఉన్నాతాధికారులు, పోలీసులు విచారణ జరిపి చర్చలు తీసుకుని కేసు నమోదు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ బయలుదేరే ముందు జ్యూస్‌ తాగుతున్న సరస్వతి

పోక్సో కేసులో ఒకిరికి పదేళ్ల జైలు

భైంసాటౌన్‌: పోక్సో కేసులో పట్టణానికి చెందిన ఒకిరికి నిర్మల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నా యి.. పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2022లో పఠాన్‌ షారూక్‌పై పోక్సో కేసు నమోదు కాగా, శుక్రవారం నిర్మల్‌ ఫా స్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ మేరకు నేరం రుజువు కాగా నిందితుడికి పదేళ్ల కఠిన కారా గార శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యా యస్థానం తీర్పు వెల్లడించింది. దర్యాప్తు అధికారి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.ప్రవీణ్‌కుమార్‌, ప్రత్యేక పబ్లి క్‌ ప్రాసిక్యూటర్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి న్యాయస్థానంలో వాదనలు వినిపించగా, కోర్టు లైజన్‌ ఎస్సై కె.రమేశ్‌, కేడీవో కె.మోహన్‌ కేసు విచారణకు సహకరించారు. బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టరీత్యా కఠి న చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ జానకీ షర్మిల స్పష్టం చేశారు. కేసు దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహించిన దర్యాప్తు అధికారి, ప్రత్యేక పబ్లిక్‌ ప్రా సిక్యూటర్‌, కోర్టు సిబ్బందిని అభినందించారు.

ప్రధాన నిందితుడి

అరెస్ట్‌తో హర్షం

ఆదిలాబాద్‌టౌన్‌: యూనిక్‌ మర్చంటైల్‌ ఇండియా లిమిటెడ్‌, యూనిక్‌ ఎస్‌ఎంసీఎస్‌ సంస్థల పేరుతో అధిక లాభాల ఆశ చూపి పెట్టుబ డులు, చిట్‌ఫండ్ల ద్వారా ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చే సిన కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ రాయ్‌ను జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్‌, మెదక్‌, వరంగల్‌, కామారెడ్డి తదితర జిల్లాలకు చెందిన సుమారు 150మంది బాధితులు గురు వారం రాత్రి ఆదిలాబాద్‌కు చేరుకుని ఎస్పీ అ ఖిల్‌ మహాజన్‌ను శాలువాతో సన్మానించారు. నిందితుడి అరెస్ట్‌తో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప్రధాన నిందితుడి అరెస్ట్‌పై హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా సుమారు 10వేల మంది డబ్బులు పెట్టి నష్టపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పెట్టుబ డుల గడువు ముగిసినా డబ్బులు అందక పలు వురు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బులు, సంస్థల ఆర్థిక లావాదేవీలు, నిందితులకు సంబంధించిన ఆస్తులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇతరుల పాత్ర, బా ధితుల సంఖ్య, పెట్టుబడి మొత్తాలపై వివరాలు సేకరిస్తున్నారు. సేకరించిన నిధులతో నిందితుడు వివిధ రాష్ట్రాల్లో ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, హైదరా బాద్‌లో 400 ప్లాట్లు, 200 ఎకరాల భూమి కొ నుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాటి ని కోర్టు ద్వారా జప్తు చేయించేలా నివేదికలు పంపనున్నట్లు పేర్కొన్నారు. మోసానికి గురైనవారు ధైర్యంగా సంబంధిత పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement