మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తూ, అభ్యర్థుల ప్రతిభ, అర్హతల ఆధారంగా ఎంపిక చేశామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో దంత వైద్య విభాగంలో అధ్యాపకుల నియామక ప్రక్రియకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవోజి మా లోతు, మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రాత పరీక్ష, పీజీ, ఇంటర్వ్యూ మార్కులను పరిగణనలోకి అభిషేక్ ఎంపికకు కమిటీ నిర్ణయించిందని అన్నారు. ప్రభు త్వ వైద్య కళాశాల మైదానం అభివృద్ధి, క్రీడా వసతుల కల్పన, తాగునీటి సదుపాయం, ఇంటర్నెట్ సౌకర్యాల మెరుగుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
సీఎంఆర్ వేగవంతం చేయాలి
భీమారం: రైస్‌మిల్లులు వరిధాన్యం లక్ష్యాలను త్వరగా పూర్తి చేసి సీఎంఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవా రం మండలంలోని అంకూసాపూర్‌లో రైస్‌మిల్లును అధికారులతో కలిసి సందర్శించారు. డిప్యుటీ తహసీల్దార్ అంజమ్మతో కలిసి మద్దికల్‌ను సందర్శించారు. గ్రామంలో భూ రీసర్వే ప్రక్రియను ఉదయం సమయాల్లో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు.


