ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడి మృతి

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

చింతలమానెపల్లి: మండలంలోని డబ్బా గ్రామ స మీపంలో శుక్రవారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాపూర్‌ గ్రామానికి చెందిన జాడి అజయ్‌ (25) మృతి చెందగా, దుర్గం ప్రేమ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. గంగాపూర్‌ గ్రామానికి చెందిన వీరు డబ్బా గ్రామంలో నిర్వహించిన బులాయి కార్యక్రమానికి హాజరయ్యారు. తెల్లవారుజామున తిరిగి వెళ్తుండగా డబ్బా, బోదంపల్లి గ్రామాల మధ్యలో మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అజయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు కింద పత్తి చేనులో ప్రేమ్‌కుమార్‌ అపస్మారక స్థితిలో ఉండగా గ్రామస్తులు గమనించి చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. మృతుడు సోదరుడు విజయ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కమలాకర్‌ తెలిపారు. కాగా, మృతుడి తండ్రి రావుజీ గతంలోనే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

ఆదిలాబాద్‌(బేల): బేల మండలం చప్రా ల గ్రామానికి చెందిన బోల్గోడ్‌ గజాన న్‌ (26) గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు, ఎస్సై మధుకృష్ణ తెలిపిన వివరాల ప్రకా రం.. చప్రాలకు చెందిన గజానన్‌, అదే గ్రామానికి చెందిన పాయల్‌ సాయికి చెందిన బొలెరో పికప్‌ వాహనంలో డోప్టాల గ్రామానికి చెందిన రాజు సోయాబీన్‌ పంటను మహారాష్ట్రలోని వణికి తరలించారు. పంటను అక్కడ అన్‌లోడింగ్‌ చేసి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి 12గంటల సమయంలో కొబ్బాయి గ్రామం దాటిన తర్వాత పాయ ల్‌ సాయి అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహ నం నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గజానన్‌, పాయల్‌ సాయికి తీవ్ర గా యాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు 108 అంబులెన్స్‌లో వారిని ఆది లాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. గజానన్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ని ర్ధారించారు. తీవ్రంగా గాయపడిన పాయల్‌ సాయి ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వ్యవసాయ బావిలో పడి వివాహిత..

నేరడిగొండ: మండలంలోని రోల్‌మామడ గ్రామానికి చెందిన గేడం కమలాబాయి (35) వ్యవసాయ బావిలో పడి మృతిచెందింది. మూ డు రోజుల క్రితం అదృశ్యమైన ఆమె మృతదేహం శుక్రవారం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి లో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. కమలాబాయి బుధవారం వ్యవసాయ పనుల నిమిత్తం చేనుకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రెండు రోజు ల పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గాలించినా ఆచూ కీ లభించలేదు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ స మీపంలోని వ్యవసాయ బావిలో ఆమె మృతదేహా న్ని గుర్తించారు. ఎస్సై ఇమ్రాన్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త మాణిక్‌రావు, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement