మహా కలప.. లోకల్‌ బ్రాండ్‌ | - | Sakshi
Sakshi News home page

మహా కలప.. లోకల్‌ బ్రాండ్‌

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

ఇతర రాష్ట్రాల కలపకు స్థానిక పర్మిట్లు

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి కలప దిగుమతిపై అనుమానాలు

టింబర్‌ డిపోలు, సా మిల్లుల్లో రికార్డులు, నిల్వలు సరిపోతున్నాయా?

ఖానాపూర్‌: దట్టమైన అడవులకు పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కలప వ్యాపారం మాటున అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. స్థానికంగా లభించే కలపకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన కలపను స్థానికంగా లభించిన కలపగా చూపిస్తూ విక్రయాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర ప్రాంతాల నుంచి కలపను తీసుకొచ్చి పర్మిట్లు, రవాణా పత్రాలు, టింబర్‌ డిపోలు, సామిల్లుల నిల్వల లెక్కలను సర్దుబాటు చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణల్లోని వాస్తవాలు అధికారుల సమగ్ర విచారణలోనే తేలాల్సి ఉంది.

ఇతర రాష్ట్రాల కలప?

ఖానాపూర్‌, జన్నారం, ఇచ్చోడ, కాగజ్‌నగర్‌ టింబర్‌ డిపోలు తదితర చోట్ల లభించే టేకు కలపకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ ప్రాంతాల నుంచి కలప ఇతర చోట్లకు తరలుతుండటంతో ‘మన కలప.. బంగారం’ అనే నానుడి ప్రాచూర్యంలో ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక కలప పేరిట ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన కలపను విక్రయిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మంచి నాణ్యత గల కలపను ‘సీపీ’ పేరుతో అమ్ముతున్నారన్న ప్రచారం ఉంది. ఈ కలప ఎక్కడి నుంచి వస్తోంది? కొనుగోలు, రవాణాకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? స్థానిక కలపగా చూపిస్తున్న నిల్వలకు సరైన ఆధారాలున్నాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల కలపకు సంబంధించిన పత్రాలను స్థానిక నిల్వలతో ముడిపెట్టి లెక్కలు సరిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఎఫ్‌ఎస్‌ఓ అరెస్ట్‌తో మరోసారి చర్చ

ఇటీవల ఖానాపూర్‌ అటవీశాఖ కార్యాలయంలో టింబర్‌ డిపో లైసెన్స్‌ పునరుద్ధరణకు సంబంధించిన తనిఖీ నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ.12 వేల లంచం తీసుకుంటూ ఖానాపూర్‌ ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ రవీందర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ సంఘటనతో టింబర్‌ డిపోల లైసెన్సుల పునరుద్ధరణ, తనిఖీ నివేదికలు, కలప నిల్వ లు, రికార్డుల నిర్వహణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ కేసులో వెలుగుచూసిన అంశాలకు, కలప వ్యాపారంలో వినిపిస్తున్న ఇతర ఆరోపణలకు మధ్య సంబంధం ఉందా? అన్నది విచారణలోనే స్పష్టమవుతుంది.

లోతైన విచారణ అవసరం

జిల్లా వ్యాప్తంగా టింబర్‌ డిపోలు, సామిల్లుల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. రికార్డుల్లో నమోదైన కలప పరిమాణాన్ని క్షేత్రస్థాయి నిల్వలతో సరిపోల్చడంతో పాటు కొనుగోలు బిల్లులు, రవాణా పత్రాలు, పర్మిట్లు, విక్రయ వివరాలను సమగ్రంగా పరిశీలించాలని సూచిస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కలప మూలాలను గుర్తించి, సంబంధిత అనుమతులను ధ్రువీకరించాలని కోరుతున్నారు. కేవలం క్షేత్రస్థాయి సిబ్బందికే పరిమితం కాకుండా పర్మిట్ల జారీ, తనిఖీ నివేదికల ఆమోదం, రికార్డుల పర్యవేక్షణలో పైస్థాయి అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఎఫ్‌ఎస్‌వో అరెస్ట్‌తో మరోసారి చర్చ.. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలకు డిమాండ్‌

పర్మిట్ల జారీలో అక్రమాలు?

కలప రవాణా, నిల్వలు, కొనుగోలు–విక్రయాలకు సంబంధించిన పర్మిట్లు, రికార్డుల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో క్షేత్రస్థాయిలో విక్రయాలు జరగకపోయినా ఫొటోలు లేదా ఇతర వివరాల ఆధారంగా పర్మిట్లు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అదనపు పర్మిట్ల ద్వారా ఇతర రాష్ట్రాల కలపను తరలించి స్థానిక కలపగా చూపిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో కొందరు అటవీశాఖ సిబ్బంది సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, వాటిని నిర్ధారించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది.

రికార్డుల్లో వ్యత్యాసాలు?

టింబర్‌ డిపోలు, సా మిల్లుల్లో కలప నిల్వలు, కొనుగోళ్లు, విక్రయాలు, రవాణా అనుమతులకు సంబంధించిన రికార్డులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. అయితే కొన్నిచోట్ల రికార్డుల్లోని వివరాలు, వా స్తవ నిల్వల మధ్య వ్యత్యాసాలు ఉన్నా వాటిని సరిచేసుకునేందుకు కొందరు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు ఈ వ్యవహారంలో పాత్రధారులు ఉన్నారా? నిబంధనలకు విరుద్ధంగా పర్మి ట్లు జారీ అయ్యాయా? రవాణా పత్రాలు, కొ నుగోలు–విక్రయ రికార్డుల్లో మార్పులు జరిగా యా? పరిశీలించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement