బెల్లంపల్లి: తమిళనాడు రాష్ట్రంలోని సుప్రసిద్ధ అరుణాచలం పుణ్యక్షేత్రంలో బెల్లంపల్లికి చెందిన మహిళా భక్తులు ఆదివారం వినూత్న రీతిలో సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. రెండు రోజుల క్రితం అరుణాచలేశ్వరుని దర్శనానికి తరలివెళ్లిన భక్తులు దైవ సన్నిధిలోనే రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి రాజగోపురం ఎదుట బతుకమ్మ ఆడిపాడారు. దైవ దర్శనానికి వెళ్లి పరాయి రాష్ట్రంలో బతుకమ్మ ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బాసర ఆలయంలో
ఎంపీ పూజలు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆదివారం ఆదిలాబాద్ ఎంపీ నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ ఈవో అంజనాదేవి, ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ పోగుల రాజేశ్వర్, బీజేపీ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ పటేల్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సతీష్‌రావు, బిద్రెల్లి సర్పంచ్ విశ్వనాథ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
రీజినల్ క్రికెట్ క్యాంప్‌లో మనోళ్లు
ఆదిలాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో కరీంనగర్లో ఈ నెల 10 నుంచి 18 వరకు నిర్వహించిన రీజినల్ కోచింగ్ క్రికెట్ క్యాంప్‌లో ఆదిలా బాద్‌కు చెందిన నలుగురు క్రికెటర్లు శిక్షణ పొందారు. జిల్లాకు చెందిన వర్షిత, శ్రేయా సింగ్, హర్షిణి, తులసి శిక్షణ శిబిరంలో పాల్గొని క్రికెట్లో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. ఈ సందర్భంగా కోచ్ జయేంద్ర పటాస్కర్ వారిని అభినందించారు.


