బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

బాసర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన ఆదివారం అమ్మవారు ‘మహాగౌరీ దేవి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భైంసా మున్సిపల్‌ చైర్మన్‌ తూముల దత్తాత్రి ఆధ్వర్యంలో భైంసా నుంచి బాసరకు 30 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో అమ్మవారి దర్శనానికి, పిల్లల అక్షరా భ్యాస పూజలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సాధారణ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement