కాజీపేట్లోనే దాదాపు 14గంటల నిరీక్షణ
బల్లార్షా–కాజీపేట రైలు ఖాళీగా ఉంచడం ఎందుకు?
సికింద్రాబాద్‌కు పొడగిస్తే రైల్వే, ప్రయాణికులకు మేలు
మంచిర్యాలఅర్బన్: దసరా రద్దీ దృష్ట్యా కాజీపేటలో గంటల తరబడి నిలిచిపోయే బల్లార్షా–కాజీపేట ఎక్స్‌ప్రెస్(17036) రైలును సికింద్రాబాద్ వరకు పొడగించాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. బల్లార్షా నుంచి కాజీపేట వరకు రాకపోకలు సాగిస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతీ రోజు ఉదయం 8.50గంటలకు కాజీపేట జంక్షన్‌కు చేరుకుని తిరిగి రాత్రి ఇదే రైలు 10.50గంటలకు బల్లార్షాకు బయల్దేరుతుంది. కాజీపేట జంక్షన్లో దాదాపు 14గంటలపాటు ఖాళీగా ఉంటుంది. ప్రాథమిక నిర్వహణ కాజీపేటలోని ఫిట్లైన్లో నిర్వహిస్తారు. రైలును కాజీపేటలో ఖాళీగా ఉంచడం కంటే సికింద్రాబాద్ వరకు పొడగిస్తే సింగరేణి కార్మిక క్షేత్ర ప్రయాణికులకు ఉదయం భాగ్యనగర్ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది. రైలును బల్లార్షా నుంచి 3.50గంటలకు బదులు 5గంటలకు ప్రారంభిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రైలు కాజిపేట వైపు వెళ్లేటప్పుడు భాగ్యనగర్ వెనకాల వెళ్తుంది. రైలు వేళలు మార్చడం వల్ల విలువైన సమయం వృథా కాకుండా రైల్వేకు ఆదాయం సమకూరుతుంది.
ప్రయాణికులకు కొండంత ఊరట
కాజిపేట నుంచి సికింద్రాబాద్‌కు రైలు పొడగింపుతో ప్రయాణికులకు మేలు జరుగుతుంది. భాగ్యనగర్, వారానికి మూడు రోజులు నడిచే రాయ్‌పూర్, దక్షిణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నా సాధారణ బోగీలు నాలుగే ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేలాడుతూ, కిక్కిరిసి ప్రయాణం చేస్తుంటారు. రైలు పొడగిస్తే మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్ ప్రయాణికులకు ఊరటనిస్తుంది.
రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులకు ఇక్కట్లు
సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యం వల్ల అదే రేక్ షేరింగ్ కలిగిన 17011 ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ నాలుగు గంటలు ఆ లస్యంగా నడుస్తూ రోజువారీ ప్రయాణికులకు శా పంగా మారుతోంది. 12757 సికింద్రాబాద్–సి ర్పూర్కాగజ్నగర్, 17011 ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్ల మధ్య వ్యవధి 20 నిమిషాలే కావడంతో ఒకదానికి వెనుక మరొకటి రాకపోకలు సాగిస్తూ ప్ర యాణికులకు విసుగు పుట్టిస్తున్నాయి. సరైన వేళల్లో నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కిక్కిరిసిన ప్రయాణం
‘సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాలంటే ఉదయం భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తప్పా వేరే దారిలేదు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే రూ.600 చెల్లించాల్సి వస్తుంది. రైలు ప్రయాణమైతే రూ.200తో గమ్యస్థానం చేరుకోవచ్చు. అందుకే రిస్క్ అయినా రైల్లోనే వెళ్తున్నాం..’ అని తాండూర్‌కు చెందిన విద్యార్థి రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.
బెల్లంపల్లి: సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య సరిపడా రైళ్లు లేక బోగీల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. గంటల తరబడి నిల్చుని నానా యాతన పడుతున్నారు. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రవేశపెట్టిన ప్రత్యేక రైలుపై కిక్కిరిసిపోతోంది. ప్రతీ రోజు తెల్లవారుజామున సిర్పూర్కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్‌కు బయల్దేరి వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఎగువ, దిగువ మార్గాల్లో రద్దీగా ఉంటోంది. సింగరేణి మెమొ, రామగిరి ప్యా సింజర్ రైళ్లలోనూ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుండడంతో గంటల తరబడి బోగీలో నిల్చుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టాయిలెట్ల వద్ద పది నుంచి 15మంది నిలబడి ఉంటున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుత స్పెషల్ రైలును రెగ్యులరైజ్ చేసి జనరల్ బోగీలను అదనంగా పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఉద యం, సాయంత్రం వేళల్లో మరో రెండు ప్రత్యే క రైళ్లు నడపడంతోపాటు మెమొ రైళ్లు కూడా ప్రవేశ పెట్టాలని రైలు డిమాండ్ చేస్తున్నారు.


