సీఎంఆర్‌ పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ పూర్తి చేయాలి

Oct 16 2026 7:29 AM | Updated on Oct 16 2026 7:29 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: రైస్‌మిల్లుల యజమానులు సీఎంఆర్‌ డెలివరీ సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ వి.రాములు అన్నారు. గురువారం అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వేణుగోపాల్‌, జిల్లా మేనేజర్‌ శ్రీకళతో కలిసి సీఎంఆర్‌ డెలివరీపై అధికారులు, రైస్‌మిల్లుల యజ మానులతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) డెలివరీలో వెనుకబడిన మిల్లులు తమ పనితీరును మెరుగుపర్చుకుని బియ్యం అప్పగించాలని తెలిపారు. కొన్ని మిల్లులు నిర్ధేశిత లక్ష్యాల సాధనలో జాప్యం చేస్తున్నాయని, పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ బియ్యం డెలివరీలను తక్షణమే వేగవంతం చేసి ప్రభుత్వం నిర్ధేశించిన కార్యాచరణ ప్రకారం గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. సీఎంఆర్‌ బియ్యం లక్ష్యాల సాధనలో ఆలస్యం జరగకుండా మిల్లర్లు చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఈ సమావేశంలో రైస్‌మిల్లర్ల సంఘం ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement