అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి

Oct 16 2026 7:29 AM | Updated on Oct 16 2026 7:29 AM

బెల్లంపల్లి: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు నాణ్యతాప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని, మున్సిపల్‌ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అనధికార నిర్మాణాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ పి.చంద్రయ్య అన్నారు. గురువారం పట్టణంలోని 17, 18వ వార్డుల్లో ఆకస్మికంగా పర్యటించారు. రూ.20 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయించాలని తెలిపారు. 17వ వార్డులో అనుమతి లేని నిర్మాణాలను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. అనధికార నిర్మాణాలకు ఇంటి నంబర్లు కేటాయించడం, వాటి వివరాలను మున్సిపల్‌ రికార్డుల్లో నమోదు చేయడం వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని 86, 87, 88, 89 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను సందర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా దావా, అభ్యంతరాల విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. బెల్లంపల్లి ఈఆర్‌ఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. బెల్లంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ తన్నీరు రమేష్‌, వైస్‌ చైర్మన్‌ రాగం శెట్టి సత్యనారాయణ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement