రామకృష్ణాపూర్: మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులోని చారిత్రక గాంధారిఖిల్లాపై మొట్టమొదటిసారిగా మైసమ్మ తల్లి పంచలోహ ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. డప్పుచప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాల మధ్య గ్రామస్తులు, భక్తులు బోనాలతో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం, మొక్కులు సమర్పించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్ మిట్టపెల్లి సరిత, నాయకులు డాక్టర్ రాజరమేష్, మిట్టపెల్లి శ్రీనివాస్, బలికొండ కిషన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


