జన్నారం: టైగర్‌జోన్ పరిధి నుంచి ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి ప్రస్తుతం పది కిలోమీటర్ల దూరం ఉందని, దీన్ని ఒక కిలోమీటరులోపు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పాదించినట్లు జిల్లా అటవీ అధికారి(డీఎఫ్ వో) రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన జన్నారంలో విలేకరులతో మాట్లాడారు. ఎకో సెన్సిటివ్‌జోన్ నిబంధనతో పరిసర ప్రాంతాల నుంచి ఇసుక తోడడం నిషేధించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఒక కిలోమీటరుకు కుదిస్తే గోదావ రి నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు అటవీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయదని అన్నారు. అట వీశాఖ నిబంధనల ప్రకారమే నడుచుకోవా ల్సి ఉంటుందని, స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎఫ్‌డీఓ రామ్మోహన్, రేంజ్ అధికారులు పాల్గొన్నారు.


