దండేపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు రెగ్యులర్ వైద్యులు ఉండగా.. ఒకరు ఉన్నత చదువులు, మరొకరు డిప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో రెండు పోస్టులూ ఖాళీ ఏర్పడ్డాయి. అటెండర్, డాటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులూ ఖాళీ ఉన్నాయి. ఓ కాంట్రాక్టు వైద్యురాలిని నియమించగా.. ఆమె రానప్పుడు సిబ్బందే వైద్యసేవలు అందించాల్సి వస్తోంది. 24గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. వైద్యులు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కో రోజు పల్లె దవాఖానాల్లోని ఎంఎల్‌హెచ్‌పీలను అందుబాటులో ఉంచుతున్నారు. కాంట్రాక్టు వైద్యురాలు మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశానికి వెళ్లగా.. రోగులకు సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. అటెండర్ లేకపోవడంతో స్వీపర్ దాయమ్మ గాయాలతో వచ్చిన వారికి డ్రెస్సింగ్ చేసి కట్టుకట్టి పంపించింది. పీహెచ్‌సీ ఇంచార్జి డీడీవో తాళ్లపేట పీహెచ్‌సీ డాక్టర్ స్నేహితను సంప్రదించగా, సమావేశానికి వెళ్లడంతో అందుబాటులో లేరని తెలిపారు.
కాలి గాయానికి డ్రెస్సింగ్ చేస్తున్న స్వీపర్
వైద్య పరీక్షలు చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్


