జన్నారం: రాష్ట్ర అటవీశాఖ ముఖ్య అటవీ సంరక్షణ అధికారి(పీసీసీఎఫ్) వినయ్‌కుమార్ మంగళవారం జన్నారం అటవీ డివిజన్‌లో ప ర్యటించారు. ఇందన్‌పల్లి రేంజ్‌లోని భర్తన్‌పే ట్ వాచ్‌టవర్ వద్దకు వెళ్లి అడవులను పరిశీ లించారు. జన్నారం పర్యావరణ అధ్యయన కేంద్రం సందర్శించి అటవీశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. అడవుల రక్షణ, వన్యప్రాణులు, పర్యాటక అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు. టైగర్‌ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతరాం, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్‌డీవో రామ్మోహన్, రేంజ్ అధికారులు ఖాదర్‌వలీ, లక్ష్మీనారాయణ, వికాస్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.


