సమర్థవంతంగా విధులు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

సమర్థవంతంగా విధులు నిర్వహించాలి

Jul 10 2026 7:28 AM | Updated on Jul 10 2026 7:28 AM

● సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా ● మాదారం ఠాణా తనిఖీ

తాండూర్‌: సమర్థవంతంగా విధులు నిర్వహించా లని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా సూచించారు. గురువారం తాండూర్‌ సర్కిల్‌ పరిధిలోని మాదారం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. పోలీస్‌స్టేషన్‌ పరిసరాలు, కమ్యూనికేషన్‌ వ్యవ స్థ పని తీరు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు గిరిజనులకు స్నేహపూర్వక పోలీసింగ్‌ వ్యవస్థను అందించడంతో పాటు సాంకేతిక సేవలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించడంతో పా టు కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలి పారు. పోలీస్‌శాఖ ద్వారా అందుబాటులో ఉన్న సాంకేతిక సేవలు, సీసీపీఎన్‌ఎస్‌ యాక్టు గురించి వివరించారు. పీఎస్‌ కాప్‌ వంటి యాప్‌లను సమర్థవంతంగా వినియోగించుకుని నేరాలను అదుపు చే యాలని పేర్కొన్నారు. గంజాయి, మత్తుపదార్థాల శాశ్వత నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్క నాటారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్‌, తాండూర్‌ సీఐ దేవయ్య, మాదారం ఎస్సై సౌజన్య ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement