‘సర్‌’ ప్రక్రియలో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ ప్రక్రియలో వేగం పెంచాలి

Jul 10 2026 7:28 AM | Updated on Jul 10 2026 7:28 AM

కోటపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ రాములు సూచించారు. బుధవారం కోటపల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి ఆధికారులకు పలు సూచనలు చేశారు. ఇంటింటా అందించిన ఫారాలను తిరిగి తీసుకుని డిజిటలైజ్‌ చేయాలని సూచించారు. అనంతరం సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, భూభారతి పెండింగ్‌ దరఖాస్తులు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం, భూ సేకరణ సంబంధిత అంశాలపై కార్యాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సకాలంలో సర్టిఫికెట్లు జారీ చేయాలని సూచించారు. తహసీల్దార్‌ రాఘవేందర్‌రావు, ఆర్‌ఐ శ్రీనివాస్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement