వైద్యశాఖలో బదిలీలు | - | Sakshi
Sakshi News home page

వైద్యశాఖలో బదిలీలు

Jun 8 2026 11:42 PM | Updated on Jun 8 2026 11:42 PM

మంచిర్యాలటౌన్‌: జిల్లా వైద్యశాఖలో జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా పలువురు స్థానచలనం పొందారు. మంచిర్యాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎండి.సులేమాన్‌ను నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వేదవ్యాస్‌ను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి ప్రొఫెసర్‌గా, ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ శ్రీమన్నారాయణను ఉస్మానియా ఆసుపత్రి ఆర్‌ఎంవోగా, ప్రొఫెసర్‌ ముసాఖాన్‌ను ఫీవర్‌ ఆసుపత్రికి ప్రొఫెసర్‌ జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి బదిలీ చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఇంచార్జి అధికారి డాక్టర్‌ అనితను హైదరాబాద్‌ డీఎంహెచ్‌వో కార్యాలయానికి బదిలీ చేశారు.

డాక్టర్‌ వేదవ్యాస్‌

ఎండి సులేమాన్‌

డాక్టర్‌ అనిత

శ్రీమన్నారాయణ

Advertisement
 
Advertisement
Advertisement