పెంచికల్‌పేట్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం బొంబాయిగూడ గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు సాయిక్రిష్ణ అంతర్జాతీయ బేస్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆసియా ఇంటర్ ప్రైవేట్ నేషనల్ గేమ్స్– 2026లో పాల్గొనే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. కాగా, దేశం తరఫున బేస్‌బాల్ పోటీల్లో పాల్గొననున్న సాయిక్రిష్ణకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అండగా నిలిచారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బీజేపీ నాయకుడు పాల్వాయి సుధాకర్ రావు క్రీడాకారుడికి నగదు ప్రోత్సాహం అందించారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు పగిడె కాంతారావు, సర్పంచ్ పొట్టె ఉమామహేశ్, ఉప సర్పంచ్ రఘునాథ్, నాయకులు మీసారి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.


