ఎస్సార్పీ 3లో కార్మికుడికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఎస్సార్పీ 3లో కార్మికుడికి గాయాలు

Jun 7 2026 11:39 PM | Updated on Jun 7 2026 11:39 PM

శ్రీరాంపూర్‌:సింగరేణి సంస్థ శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఎస్సార్పీ 3 గనిలో శనివారం నైట్‌షిఫ్ట్‌ విధులకు వచ్చిన కార్మికుడు దండు శ్రీకాంత్‌ గాయపడ్డాడు. ట్రామర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్‌ ఆదివారం తెల్లవారు జామున 5 సీమ్‌, జీరో లెవల్‌ 7 రేస్‌ వద్ద ట్రబ్బు ట్రా క్‌పై నుంచి జారడంతో బల్ల వేసి దానిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్క సారిగా జంప్‌ కావడంతో పాయకు, రేస్‌కు మద్య ఇరుకున్నాడు. దీంతో తుంటి భాగంలో తీవ్ర గాయమైంది. వెంటనే అక్కడున్న కార్మికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం, తుంటి భాగంలో రెండు ఫాక్షర్లు ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఈత చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు..

జన్నారం: మండలంలోని ఇందనపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు గాజుల నారాయణ గౌడ్‌ ఈత చెట్టు పైనుంచి పడి గాయాలపాలయ్యాడు. శనివారం సాయంత్రం ఈత చెట్టెక్కి కల్లు గీస్తుండగా మోకు జారడంతో కిందపడి రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు అందించిన సమాచారంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పేద గీత కార్మికుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ సంఘం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు మూల భాస్కర్‌గౌడ్‌, నారాయణగౌడ్‌ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement