కార్మిక వ్యతిరేక విధానాలతోనే సింగరేణికి నష్టాలు | - | Sakshi
Sakshi News home page

కార్మిక వ్యతిరేక విధానాలతోనే సింగరేణికి నష్టాలు

Jun 7 2026 11:39 PM | Updated on Jun 7 2026 11:39 PM

● బీఎంఎస్‌ జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్‌చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి ● భూపాలపల్లిలో సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘం మహాసభలు

భూపాలపల్లి అర్బన్‌: కార్మిక వ్యతిరేక విధానాలు, గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల వైఫల్యంతోనే సింగరేణి సంస్థ నష్టాలబాట పట్టిందని బీఎంఎస్‌ జాతీ య బొగ్గు పరిశ్రమల ఇన్‌చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి విమర్శించారు. జయశంకర్‌ భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కమ్యూనిటీహాల్‌లో ఆదివారం సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘం 29వ ద్వైవార్షిక మహాసభలు నిర్వహించారు. తెలంగాణలోని 12 డివిజన్లకు చెందిన సుమారు 500 మంది ప్రతినిధులు హాజరైన ఈ మహాసభలో లక్ష్మారెడ్డి మాట్లాడా రు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హా మీలు నెరవేర్చడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిథ్య సంఘం ఐఎన్‌టీయూసీ పూర్తిగా వి ఫలమయ్యాయని ఆరోపించారు. కార్మికసమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపకుండా యాజమాన్య ం, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మూడేళ్లుగా కార్మిక సమస్యల పరిష్కారానికి సంఘాలు చర్యలు తీసుకోలేదని, స మ్మె పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టించాయని ఆయన మండిపడ్డారు. కార్మికహక్కుల సాధన, వేతనాల అమలు, కనీస పెన్షన్‌ వంటి అంశాలపై బీఎంఎస్‌ జాతీయస్థాయిలో పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం సింగరేణికి రూ.51,149 కోట్ల విద్యుత్‌ బొగ్గు బకాయిలను వెంటనే చెల్లించా లని డిమాండ్‌ చేశారు. 12వ వేజ్‌బోర్డు అమలుకు సంబంధించి కోలిండియా యాజమాన్యం వెంటనే క మిటీ ఏర్పాటు చేసి నోటిఫికేషన్‌ జారీ చేయాలని కో రారు. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నివారించ డం, కొత్త బొగ్గు గనుల అభివృద్ధి, కార్పొరేట్‌ మెడికల్‌ బోర్డు పునరుద్ధరణ, తొలగించిన కార్మికులకు మరో అవకాశం కల్పించడం, కాంట్రాక్ట్‌ కార్మికులకు కోలిండియా తరహా వేతనాలు అమలు చేయడం వంటి డిమాండ్లను ప్రస్తావించారు. జాతీయ నాయకులు మాధవ్‌నాయక్‌, యాదగిరి సత్తయ్య, సారంగపాణి, వర్షా ఉడికే, భూపాలపల్లి బ్రాంచ్‌ నాయకులు వెలబోయిన సుజేందర్‌, ఆర్‌ నర్సింగ్‌రావు, అల్లం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement