హాజీపూర్‌లో దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

హాజీపూర్‌లో దారుణ హత్య

Jun 7 2026 11:39 PM | Updated on Jun 7 2026 11:39 PM

● పెద్దనాన్నను కత్తితో పొడిచిన కుమారుడు ● భూతగాదాలే కారణం

● పెద్దనాన్నను కత్తితో పొడిచిన కుమారుడు ● భూతగాదాలే కారణం

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): హాజీపూర్‌లో దారుణ హ త్య కలకలం సృష్టించింది. పో లీసుల కథనం ప్రకారం.. హా జీపూర్‌కు చెందిన పెద్దనాన్న పూదరి భాస్కర్‌(65), కుమారుడు పూదరి వినయ్‌ మధ్య ఇటీవల భూతగాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆదివా రం రాత్రి వినయ్‌ కత్తితో వచ్చి అందరూ చూస్తుండగానే భాస్కర్‌పై రెండుసార్లు దాడిచేశాడు. తీవ్ర గా యాలైన ఆయన్ను అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు స త్యనారాయణ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కా గా, ఈ దాడిలో భాస్కర్‌ కుమారుడు సత్యనారాయణకు గాయాలయ్యాయి. హాజీపూర్‌ ఎస్సై కిరణ్‌కుమార్‌ ఘటనస్థలాన్ని పరిశీలించారు. దాడి చేసిన వినయ్‌ను అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాలుజారి బావిలో పడి వ్యక్తి మృతి

జన్నారం: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు..మండలంలోని చింతగూడకు చెందిన గజ్జల భూపతి (31) ఆ దివారం తాను కౌలుకు చేస్తున్న భూమిలో పంటవ్యర్థాలు తొలగించడానికి వెళ్లాడు. అక్కడే బహిర్భూమికని వెళ్లాడు. పక్కనే ఉన్న బావివద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందాడు. మృతుడి భార్య శ్వేత ప్రస్తుతం నిండుగర్భిణి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు సత్తవ్వ–మల్లేశ్‌తోపాటు భార్య రోదించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కిందపడి ఆర్మీజవాన్‌ ఆత్మహత్య

కాగజ్‌నగర్‌రూరల్‌: రైలు కిందపడి ఆర్మీజవాన్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ సురేష్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని బురదగూడకు చెందిన కొట్రంగి సురేష్‌(32) అస్సాంలో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో మద్యం తాగుతుండడంతో మానేస్తేనే నీతో అస్సాంకు వస్తానని భార్య తిరుమల చెప్పింది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి మద్యం తాగాడు. మత్తులో క్షణికావేశంలో కాగజ్‌నగర్‌, రెబ్బెన రైల్వేస్టేషన్ల మధ్య గల పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో ఆదివారం గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలంలో మద్యం బాటిళ్లు లభించాయి. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement