మంచిర్యాలటౌన్: ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రోజువారీగా వినియోగించే వంట నూనెలు, ఇతర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచుతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థికంగా భారం పడుతోంది. ఏ ధర పెరిగినా, వాటి ప్రభావం ఇతర వాటిపై పడుతోంది.
– రాజమణి, గృహిణి, మంచిర్యాల
భరించడం కష్టమే
మంచిర్యాలటౌన్: అన్నింటి ధరలు ఒకేసారి పెరుగుతుండడంతో సామాన్యుల నెలవారీ ప్రణాళిక మారుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలను భరించడం కష్టంగా మారింది. వీటికితోడు వంట గ్యాస్ ధరలను పెంచుతూ పోతున్నారు. వచ్చే వేతనాలకు, ఖర్చులకు పొంతన లేకుండా పోతుంది. పెరిగిన ధరలతో అప్పులు చేయడం తప్ప వేరే గత్యంతరం లేదు.
– సునీత, గృహిణి, మంచిర్యాల


