మంచిర్యాలక్రైం: జిల్లాలోని హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఆహార భద్రత నియమాలు పాటించాలని జిల్లా ఆహార భఽద్రత అధికారి జీ.మహేష్ అన్నారు. ఆదివారం ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార ఉత్పత్తులను తయారు చేయకూడదన్నారు. ఆహార ఉత్పత్తుల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ప్లాస్టి క్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వాసురాము నాయక్, 65 మంది వ్యాపారులు పాల్గొన్నారు.


