‘పది’ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

‘పది’ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

Jun 7 2026 11:39 PM | Updated on Jun 7 2026 11:39 PM

మంచిర్యాలటౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోతరగతిలో అత్యధిక మార్కులు సాధించిన రెడ్డి కులానికి చెందిన విద్యార్థులకు ఆదివారం జిల్లా కేంద్రంలో రెడ్డి మహిళా వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీ య బహుమతి రూ.6 వేలు, తృతీయ బహుమతి రూ.4 వేలు అందించారు. మొత్తం 10 మంది విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి సంఘం జిల్లా సభ్యులు సంతోషం గోపాల్‌రెడ్డి, వి.మధుసూదన్‌రెడ్డి, కె.సరేందర్‌ రెడ్డి, బొమ్మ సత్తిరెడ్డి, తాళ్ల సంపత్‌రెడ్డి, ఓడేటి బలరాంరెడ్డి, రెడ్డి మహిళా వెల్ఫేర్‌ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు గోనె మణిమాల, పద్మ, భాగ్యలక్ష్మి, పి.సుధా, స్వాతి, లీలా, బి.రాణి, పి.దివ్య, బి.సరిత, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement