కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

Jun 7 2026 11:39 PM | Updated on Jun 7 2026 11:39 PM

మంచిర్యాలటౌన్‌: కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 18న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాసభ విజయవంతం చేయాలని బిల్డర్స్‌ అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల సత్యమూర్తి, ఉమ్మ డి జిల్లా చైర్మన్‌ సిరాజ్‌ ఉర్‌ రహమాన్‌ కోరారు. ఆదివారం ఇందుకు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రెయినేజీల నుంచి డ్యామ్‌ల నిర్మాణం వరకు వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్‌ శాఖల్లో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌కు అనుగుణంగా ప్రాధాన్యత గల పనులను కొనసాగించి, లేనివాటిని నిలిపివేసి కాంట్రాక్టర్ల డిపాజిట్లు తిరిగి చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ మాజీ చైర్మన్‌లు బి.సుగుణాకర్‌రావు, కట్కూరి దేవేందర్‌రెడ్డి, యూ.సురేందర్‌, స్టేట్‌ అడ్వైజర్‌ కె.ప్రభాకర్‌రెడ్డి, ఆదిలాబాద్‌ మాజీ చైర్మన్‌ రామారావు, రవీందర్‌రావు, మనోజ్‌, జితేందర్‌, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement