చెన్నూర్: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపుతోంది. రెండు నెలల కాలంలోనే రెండు సార్లు గ్యాస్ ధరలు పెంచడం దారుణం. పెరిగిన ధరలతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1,016లకు చేరింది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచుతూ పోతే నిరుపేదలు బతకడం కష్టమే. పెంచిన ధరలను తగించాలి.
– చిలుముల స్వప్న, గృహిణి, చెన్నూర్
కట్టెలపొయ్యే దిక్కు..
చెన్నూర్: కేంద్ర ప్రభుత్వం మాటిమాటికి గ్యాస్ ధరలు పెంచుతూ పోతుంటే కట్టెలపొయ్యే దిక్కయ్యేటట్లు ఉంది. వంట చెరుకు సైతం లభించడం లేదు. ఇలా అయితే పేదలు ఎలా బతికేది. పోయిన నెలలోనే ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచింది. మళ్లీ గ్యాస్ ఽసిలిండర్‌పై రూ.29 పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది.
– పాతర్ల నిర్మల, గృహిణి, చెన్నూర్


