మహిళల భద్రతకు షీ టీం | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు షీ టీం

Jun 7 2026 12:21 AM | Updated on Jun 7 2026 12:21 AM

లక్సెట్టిపేట: మహిళల భద్రత కోసమే పోలీసు శాఖ షీ టీంను ఏర్పాటు చేసిందని డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ అన్నారు. శనివారం మున్సిపల్‌ పరిధిలోని ఎల్‌కే గార్డెన్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకతాయిలు మహిళలు, చిన్నారులను వేధిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలియజేయాలని అన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దన్నారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి మానసికంగా, శారీరకంగా నష్టపోవద్దని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలు అమ్మినా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంత అంజలి, కౌన్సిలర్‌ రాజలింగయ్య, కమిషనర్‌ విజయ్‌కుమార్‌, తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌, ఎస్సై గోపతి సురేష్‌, ఏవో శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement