చిరుతదాడిలో లేగదూడ మృతి | - | Sakshi
Sakshi News home page

చిరుతదాడిలో లేగదూడ మృతి

Jun 7 2026 12:09 AM | Updated on Jun 7 2026 12:09 AM

తానూరు: మండలంలోని మోగ్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచా రంతో స్థానికులు బెంబేలెత్తుతున్నా రు. మోగ్లి గ్రామానికి చెందిన రైతు పోతన్న శుక్రవా రం ఆవులను మేపి పొలంలో కట్టేసి రాత్రికి ఇంటికి వెళ్లాడు. శనివారం రైతు పొలానికి వెళ్లగా లేగదూడ కనిపించలేదు. సమీపంలో వెతకగా మృతిచెంది ఉంది. అక్కడ చిరుత పాదముద్రలు కనిపించడంతో వెంటనే అటవీ అధి కారులకు సమాచారం అందించారు. సెక్షన్‌ అధికారి రవికమార్‌, సిబ్బంది శివ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత దాడిలో లేగదూడ మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేన్లకు గుంపులుగా వెళ్లాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement