స్పందనకు అండగా కదిలారు.. | - | Sakshi
Sakshi News home page

స్పందనకు అండగా కదిలారు..

Jun 7 2026 12:09 AM | Updated on Jun 7 2026 12:09 AM

అమెరికాలో విరాళాల సేకరణ అక్కడి సోషల్‌ మీడియాలో ‘సాక్షి’ కథనం తల్లిదండ్రులను అమెరికా పంపేందుకు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ఏర్పాట్లు

శ్రీరాంపూర్‌: ‘అయ్యో బిడ్డా.. వచ్చేదెట్లా’ శీర్షిక న ఈ నెల 4న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాని కి పలువురు మానవతావాదులు స్పందించా రు. నస్పూర్‌ షిర్కే కాలనీకి చెందిన వ్యాన్‌ డ్రైవ ర్‌ లగిశెట్టి శ్రీనివాస్‌, సునిత దంపతుల కూ తురు స్పందన అమెరికాలోని చికాగోలో ఎంఎస్‌ రెండో సంవత్సరం చదువుతుండడం, గత నెల 31న కాలేజీకి వెళ్లి వస్తూ మెట్రోస్టేషన్‌లో మెట్లపై నుంచి పడి గాయపడడం తెలిసిందే. అపస్మారక స్థితిలో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అక్కడ కూతురు ఎలా ఉందో, ఎలాంటి వైద్యం అందుతుందోనని తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అ క్కడికి వెళ్లడానికి ఆర్థిక పరిస్థితి అంతంత మా త్రమే కావడం, పాస్‌పోర్టు, వీసా కూడా లేకపోవడం ‘సాక్షి’ కథనంలో ప్రస్తావించింది. ఈ కథనాన్ని పలువురు వాట్సప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశా రు. ఇక్క డి నుంచి వెళ్లి అమెరికాలో ఉద్యోగా లు చేస్తున్న వారు, చదువుతున్న వారు ‘సాక్షి’ కథనం ద్వారా కుటుంబ వివరాలు, ఫోన్‌నంబ ర్లు, ఆస్పత్రి వివరాలు తెలుసుకున్నారు. ఒక బృందంగా ఏర్పడి ఫండ్‌ సేకరణ మొదలు పె ట్టారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్సకు సుమారు రూ.3కోట్లు ఖర్చవుతాయని తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొంత డబ్బు సమకూరగా.. మరికొంత మంది దాతలు ముందుకు వస్తే స్పందన పూర్తి వైద్యానికి భరోసా ఉంటుందని ఎదురుచూస్తున్నారు.

అమెరికా పంపడానికి ఏర్పాట్లు..

స్పందన తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోగా శుక్రవారం పాస్‌పోర్టు వచ్చింది. శనివారం స్పందన తండ్రి శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేంసాగర్‌రావును కలిసి తన సమస్యను విన్నవించారు. దీంతో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో వారికి వీసా ఇప్పించి అమెరికా పంపించే ఏర్పాట్లు చేస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు.

మాయలేడీలపై కేసు నమోదు

మంచిర్యాలటౌన్‌: ‘మంచిర్యాలలో మాయలేడీలు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంచిర్యాల పోలీసులు స్పందించా రు. రుణాల పేరిట పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు మహిళలపై శనివా రం కేసు నమోదు చేశా రు. మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని ఇక్బాల్‌ అహ్మద్‌నగర్‌కు చెంది న బద్రూన్నిసా, గోపాల్‌వాడకు చెందిన అరవ సుబ్బలక్ష్మి కలిసి ఈ ఏడాది జనవరి నుంచి కొందరు మహిళలకు రూ.5 లక్షలు లోన్‌ ఇప్పిస్తామని నమ్మించారు. అందుకోసం కొంత డబ్బు ఖర్చవుతుందని సుమారు పది మంది మహిళల నుంచి దాదాపు రూ.3లక్షలు వసూలు చేశారు. రుణం ఇప్పించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. బాధితులు డ బ్బుల విషయమై ప్రశ్నించగా బెదిరించారు. దీంతో షేక్‌ రిజ్వానా, బాధితులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఎఫెక్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement