కోటపల్లి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదనపు కలెక్టర్ రాములు అదేశించారు. సర్వాయిపేట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని లారీల నుంచి త్వరితగతిన అన్‌లోడ్ చేసి లారీల నిల్వ సమయాన్ని తగ్గించాలని సూచించారు. అవసరమైన లారీలు సమకూర్చే విధంగా గుత్తేదారులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో జీపీవో మల్లక్క, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం తరలించేలా చర్యలు..
వేమనపల్లి: దస్నాపూర్, కొత్తపల్లి గ్రామాల రైతుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ రాములు అన్నారు. ‘తప్పెవరిది.. శిక్ష ఎవరికి’ శీర్షికన ప్రచురితమైన సాక్షి కథనానికి స్పందించిన ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. సెంటర్లకు అదనంగా లారీలు వచ్చేలా కాంట్రాక్టర్లతో మాట్లాడి నాలుగు రోజులలో ధాన్యం తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సాయి కృష్ణ, ఆర్‌ఐ ఖాలిక్, ఏపీఎం ప్రమోద కుమారి, పీఏసీఎస్ సీఈవో రాజు నాయక్, రైతులు పాల్గొన్నారు.


