చెన్నూర్: పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ అధ్యక్షతన వార్డుసభలు నిర్వహించారు. 1వ వార్డులో అదనపు కలెక్టర్, 6వ వార్డులో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కరమే లక్ష్యంగా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, వైస్ చైర్మన్ వినయ్‌కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
చెన్నూర్‌రూరల్: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండలంలోని అక్కెపల్లితో పాటు వివిధ గ్రామాల్లో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కెపల్లిలో జరిగిన కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య హాజరై మాట్లాడారు. ఓటర్ లిస్టు రివిజన్ గురించి వివరించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సి న జాగ్రత్తలు, మొక్కలు నాటడం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నక్క కల్పన, జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజ్మత్ అలి, ఏఎస్సై మాజిద్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


