ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులోనే 60 మార్కులు ప్రశ్నపత్రం రూపకల్పన చేసేలా సిలబస్ డిజైన్ చేయాలి. ఇన్‌సర్వీసులో టీచర్లకు ప్రత్యేక టెట్ పరీక్ష తప్పనిసరి. పేపర్–2లో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్, గణితం తదితర సబ్జెక్టులో 60 మార్కులు ఉండేలా సిలబస్ రూపకల్పన చేయాలి.
– రాసమల్ల రవి,
టీఆర్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
సబ్జెక్టుకు అనుగుణంగా..
ఇన్‌సర్వీసు టీచర్లకు ఏటా రెండు ప్రత్యక టెట్ నిర్వహించటం సంతోషకరం. బోధించే సబ్జెక్టుకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలి. హిందీ సబ్జెక్టు బోధించే స్కూల్ అసిస్టెంట్లకు సోషల్ సిలబస్ పెట్టడం, బయాలజీ బోధించే టీచర్లకు గణితం సిలబస్ ఉండటం సరికాదు. బోధించే సబ్జెక్టుకు అనుగుణంగా సిలబస్ ఉండాలి.
– బన్న రవీందర్, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
ఇన్‌సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని కోరుతూ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక టెట్ నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం హర్షనీయం.
– తోట నరేంద్రబాబు, పీఆర్టీయూటీఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు


