‘చెక్క’ని బొమ్మలు | - | Sakshi
Sakshi News home page

‘చెక్క’ని బొమ్మలు

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

● కర్రతో అద్భుత ఖండాలు ● తీర్చిదిద్దుతున్న దుగ్నెపల్లి వాసి ● నైపుణ్యం చాటుతున్న శ్రీధర్‌చారి

చెన్నూర్‌రూరల్‌: నిరుపేద కళాకారుడు కర్రతో అద్భుత కళారూపాలు తయారు చేసి శెభాశ్‌ అనిపించుకుంటున్నాడు. వివిధ కళాకృతులను చక్కని ఆకృతిలో చెక్కుతున్నాడు. ఆయనే చెన్నూర్‌ మండలం దుగ్నెపల్లి వాసి పంచకోటి శ్రీధర్‌చారి. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన కులవృత్తి అయిన వడ్రంగి పనిని ఎంచుకుని తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నా డు. కస్టమర్లకు నచ్చేలా తన కళా నైపుణ్యంతో కర్రలపై వివిధ బొమ్మలు, ఆకృతులు చెక్కి ఇస్తున్నాడు. తలుపులు, బెడ్లపై, ఇంట్లో అలంకరించేలా దేవుడి, అనేక రకాల బొమ్మలను ముందుగా కాగితంపై డిజైన్‌ గీసి కర్రపై వులితో చెక్కుతాడు. ఏనుగులు, గుర్రాలు, పాము, చిన్నికృష్ణుడు, లాఫింగ్‌ బుద్ద, సింహం బొ మ్మ ఇలా అనేక బొమ్మలను చేతితో తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. పేద కళాకారుడికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని పలువురు కోరుతున్నారు.

చిన్నికృష్ణుడు

Advertisement
 
Advertisement
Advertisement