గన్నీ బ్యాగుల కోసం ఆరాటం | - | Sakshi
Sakshi News home page

గన్నీ బ్యాగుల కోసం ఆరాటం

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

వాతావరణం మారుతోంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గన్నీ సంచుల కొరత రైతులను వేధిస్తోంది. సారాంపూర్‌ మార్కెట్‌ యార్డులో మూడు రోజులుగా గన్నీ సంచులు లేక రైతులు ధాన్యం విక్రయించుకోలేకపోతున్నారు. కొందరు రైతులు కౌట్ల(బి) వ్యవసాయ సహకార సంఘం గోదాముల్లో ఉన్న సంచుల కోసం వెళ్తున్నారు. అయితే అక్కడ ముందుగా బుక్‌ చేసుకున్నవారికే సంచులు ఇస్తున్నారు. గురువారం సారంగాపూర్‌ రైతులు వెళ్లగా నమోదు చేసుకున్న రైతులకే బ్యాగులు ఇచ్చారు. దీంతో మిగతా రైతులు మార్కెట్‌ సీఈవోపై సఅహనం వ్యక్తం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌ నిర్మల్‌

Advertisement
 
Advertisement
Advertisement